కడలి అలకైన లేదు
నిరాశ,
పడి
లేస్తున్నందుకు.!
మోడుకైన లేదు
విచారము,
మరలా
చిగురించేవరకు.!
మరి నీలో ఎందుకు
నైరాశ్యము,
ప్రగతి పరీక్ష
గూర్చి.!
చకోరంలో లేదు ప్రయత్న
లోపం,
వర్ష బిందువు కోసం.!
మిణుగురంలో లేదు
ప్రయత్న లోపం,
నిశంను వెలుగుగా
నింపడం కోసం.!
మరి నీలో ఎందుకు
ప్రయత్న లోపం,
జీవన పోరాటం కోసం.!
ఈ ప్రయత్న లోపాన్ని
మరుగునపెట్టేదే - విద్యాభ్యసన
నీలో మరుగునపడ్డ
మస్తిష్కాన్ని నిద్రలేపి -
విదావ్యాపకం పెంచుకో..!
15th May, 2009.
0 comments:
Post a Comment
మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు