గడిపేస్తానులే
నేను గడిపేస్తానులే.
నీవే లేని నా లోకం
గడిపేస్తానులే.
నా జీవితం నుంచి
విచ్చుకున్న
పోగామంచై వెల్లిపోయావే.
బడలికలేని
ప్రస్థానంలోకి
వేరొకరితో
అడుగులేశావు,
నాలో తరగని
భావోద్వేగాల సమ్మేళనాన్ని
పరిచయాల
హస్తగతంలోకి నేట్టావు.
నిన్న రాత్రి
నా కలకి అంటుకున్న
కార్చిచ్చువి నీవే.
నవమినాటి వెన్నెల
వేలుగైపోయే.
నీ పదాల పెదాల
స్పర్శకు పులకించేను.
వాంఛలన్నీ వరమైన
ప్రాణమిది.
నన్నోదిలిన నీ నీడ
ఎడబాటు విరహమై
కూర్చుంది.
కానీ పిచ్చిమనస్సు
వెర్రిమంటై వేగుతున్నది.
ఇవి నిదురని
చెడగొట్టే నేరాలే..!!
సగం రాత్రి కరిగాక
నిశ్శబ్దం
ఆవరిస్తుంది !
ఆ నిశ్శబ్దాల
పందిరికి అల్లుకున్న
మాటల పరువాన్ని
నేను.
భావాన్ని
పట్టివ్వలేని నా హృదయ కలం
కదిలే నీటి అలలపై
ప్రతిబింబం అయింది.
నీ కోసం
చేయాలనుకున్నది
ఇప్పుడు
నా కరముల వెనుక
కనలిపోయింది.
గతకాలపు కాలాన్ని
వర్తమానంలా
నడిపించే సూరీడు,
నడిచి వస్తూనే
ఉన్నాడు - నా భవిష్యతై...!!!
17th September,
2010.
0 comments:
Post a Comment
మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు