కదిలే కాలం దేని
కోసం ఆగదు
నడిచే ధనం ఎవ్వరి
కోసం దాగదు
వీటి రాక కోసం
మానవుడూ ఆగడు.
కాలమే ధనము
అంటుంటారు.
ఈ ధనము కోసమే
మానవుడు.
నిరంతర ఈ జీవన
చట్రంలో
కాలము ధనమును
హరించి వేస్తే
ధనము మానవుడిని
హరిస్తుంది - కుంభకోణాల రూపంలో !
కదిలే కాలంతో పాటే
ధనము పయనిస్తుంది
మానవుడిని తనవెంట
ధనము పరిగేట్టిస్తుంది
ఈ ప్రయాణం
సాగించలేని పవనుడు
గతించిన కాలంలా
కొట్టుకుపోతున్నాడు - జన జీవన స్రవంతిలో !
కాలానికి కాలమే
గొప్ప,
ధనమునకు ధనమే గొప్ప, అయితే
ఈ గొప్పల మధ్యలో
మానవుడో భందీఖాన
కాలము కొలతల్లోకి
జీవితాన్ని కుదిస్తాం . .
కడతెరితెగాని
కనుమరుగవనిది ఈ ధన ప్రాస్థానం.
14th October,
2009.
0 comments:
Post a Comment
మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు