స్వేదం విలువను
ఎరిగితివా ?
కష్టించే తత్వమును
ఎరిగితివా ?
ఎరుగకపొతే చూడు
ఎక్కడో ఎర్రటి
ఎండలనక
స్వేధాన్ని
చిందించే కర్షకుడిని,
ఉష్ణ యంత్రాల మధ్య
కష్టించే కార్మికుడిని.
స్వేధాన్ని ధారపోసే
ఆ కర్షకుడు
స్వేధాన్ని ఆవిరిగా
మార్చే ఈ కార్మికుడు
చేసేవి వేరైనా పడే
వ్యధ ఒకటే.
ఒకటిగా మారని వారి దుస్థితిని
కడవలలో పెట్టి బేరం
పెట్టె యజమానికి
ఇంతకన్నా పాపము
తెలియట్లేదేమో . !
కార్మికులే
దేశానికి పట్టుకొమ్మలు అంటారు.
కొమ్మలైన
కార్మికులు లేకపోతె
పట్టులాంటియజమానుల
జాడ కానవస్తుందా . . ?
బక్కచిక్కినా ఓ
కర్షకా,
పర్యావరణ లోపం వలన
నువ్వూ కర్మికునిలా మారాల్సిందేనా.
జీవన భ్రమణంలో
భ్రమిస్తూనే
కాలం
కొలతనుతగ్గించే కాలంలో ఉండాల్సిందేనా . . . ?
పారీశ్రామీకరణ
ఫలితంగా
ధనాగారం కోసమై
ధాన్యాగారాన్ని
విస్మరిస్తే ఏమగునో ఆలోచించు...!!!
27th March,
2010.
0 comments:
Post a Comment
మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు