మనసుఆరాటం చెప్పలేనిది.
ఎందుకో అది నిను
కలుసుకోవాలని..
మదిగదిలో దాచుకొన్న ఊసులు
నీకు చెప్పాలని..
చెప్పిన ఊసులను బాసలవలె
మార్చాలని..
మార్చిన బాసలు కలకాలం
ఉండాలని..
ఎదపైనే నీ పేరు ఉండాలని...
ఎదలోపలె నీ ఊసులు దాచాలని..
సప్తవర్ణాల తేజం మోముపై
వికసించాలని..
వికసించిన మోము చూసి
అనుభూతి పొందాలని..
మన కలయిక సూర్యోదయము వలె..
మన ఆశలు వికసించే పద్మం వలె..
మన ప్రయాణం ప్రవహించే
జీవనది వలె..
మన సాంగత్యం ఆదర్శంగా
ఉండాలని..
మనసు ఆరాటం గొల్పుతుంది.
10th
October, 2009
0 comments:
Post a Comment
మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు